ఎన్ని విమర్శలు వచ్చినా.. రాజధాని ప్రాంత రైతులు 215 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా మూడు రాజధానులపై ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. మూడు రాజధానులు, సిఆర్డిఏ రద్దు బిల్లులను రేపు స్పీకర్ తమ్మినేని సీతారాం.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపించనున్నట్టు తెలుస్తోంది.
ఈ బిల్లులను పరిశీలించిన తరువాత గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారని సమాచారం. సాధారణంగా రాష్ట్ర పరిధిలోని బిల్లులకు గవర్నర్ ఆమోదం ఉంటే సరిపోతుంది. కానీ కేంద్ర చట్టాలతో ముడిపడివున్న బిల్లులను మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భవిశ్యత్ లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలనే రాష్ట్రపతి ద్వారా ఆమోదముద్ర వేయించుకోవాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.