మాస్క్ తప్పనిసరి చేసిన ఏపీ ప్రభుత్వం

Update: 2020-07-17 16:31 GMT

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిపై పోరాటంలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే స్థలాలు, ప్రయాణాల్లో మాస్క్ కచ్చితంగా వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా.. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు ఇప్పటికే మాస్క్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

Similar News