బెజవాడ డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ అమ్ముతూ ఇద్దరు విదేశీయులు పట్టుబడటం కలకలం రేపుతోంది. గతంలో కూడా విజయవాడలో డ్రగ్స్ రాకెట్లో విదేశీయుల హస్తం బయటపడింది. వీళ్ళనుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న కోనేరు అర్జున్ అనే యువకుడు స్థానికంగా వీటిని అమ్మడంలో కీరోల్ పోషిస్తున్నారు. సూడాన్ కు చెందిన రసూల్ A1 గా టాంజానియాకు చెందిన యోనా A2గా, కోనేరు అర్జున్ A3 గా కేసు నమోదు చేశారు పోలీసులు.
అలాగే ఈ విదేశీయుల ఇద్దరి నుంచి డ్రగ్స్ కొని కాలేజీ విద్యార్థులకు అమ్ముతున్నారు అర్జున్. పెనమలూరులోని ఓ కాలేజీలో బీటెక్ చేసిన అర్జున్ అప్పటి పరిచయాలు ఉపయోగించి స్టూడెంట్స్ కి డ్రగ్స్ అమ్ముతున్నాడు. అలాగే ఇతర కాలేజీలలో స్నేహితుల ద్వారా మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు. అర్జున్ నుంచి డ్రగ్స్ ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారో తెలుసుకునేందుకు పోలీసులు పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా త్వరలోనే మరింత లోతుగా విచారణ మొదలు పెట్టబోతున్నారు.