దేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 34,956 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 687 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 10,03,832కు చేరింది. దేశవ్యాప్తంగా కరోనా మరణాలు 25,602కు పెరిగాయి. మొత్తం పాజిటివ్ కేసుల్లో 3,42,473 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారినుండి 6,35,757 మంది కోలుకున్నారు.