కానిస్టేబుల్ ఆత్మహత్య.. నాలుగు నెలల క్రితమే..

Update: 2020-07-17 13:58 GMT

కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి ఉంటాడు. ఉద్యోగం కోసం చేసిన కసరత్తులు మనిషిని దృఢంగా చేసినా, మనసుని కఠినంగా మార్చలేకపోయాయి. గత ఫిబ్రవరిలో పెళ్లి కూడా చేసుకున్నాడు. బలవన్మరణానికి దారితీసిన పరిస్థితులు ఏమై ఉంటాయో కాని చేజేతులా జీవితాన్ని అంతమొందించుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్యచేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్ పత్ పట్టణానికి చెందిన పరీక్షిత్ (25) 2018 నుంచి పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. బురారీ లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన మీనాక్షిని ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్నాడు. పెళ్లైన నాలుగు నెలలకే ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకి దారి తీస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షిత్ భార్య మీనాక్షిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Similar News