అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. పోర్టు బ్లెయిర్‌కు తూర్పున 250 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. శుక్రవారం ఉదయం 10.31 గంటలకు భూకంపం సంభవించిందని ఎన్‌సీఎస్ ఓ ట్వీట్‌లో పేర్కొంది. పోర్టు బ్లెయిర్‌కు తూర్పున 250 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు పేర్కొంది. ఇటీవల అండమాన్, నికోబార్ దీవుల్లోని డిగ్లిపూర్‌లో కూడా రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. వారంరోజుల్లోనే మరోసారి భూకంపం సంభవించడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.