జమ్ముకశ్మీర్‌లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 4.55 గంటలకు భూమి కంపించింది. భూకంపం తీవ్రత భూకంపలేఖినిపై 3.9గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది.కత్రా పట్టణానికి 88 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
గురువారం గుజరాత్‌లో 4.5 తీవ్రతతో భూమి కంపించింది. ఉత్తర భారతదేశంలో వరుసగా భూకంపాలు సంభవిస్తుడటంతో.. ప్రజలు ఆందోళనకు గురవతున్నారు.