జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌లో జరిగింది. ఈ ఘటనలో భద్రతాదళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లాలోని నాగ్నాడ్-చిమ్మెర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
నాగ్నాడ్-చిమ్మెర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. గాలింపు బృందంపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాదళాలు ఎదురు కాల్పులు జరిపాయని పోలీసులు తెలిపారు.