ఏపీలో కరోనా మహమ్మారి అంతకంతకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు భారీ సంఖ్యలో కొత్త కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. గుంటూరు జిల్లాలో మొదటి నుంచి వైరస్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా.. ఈ సంఖ్య ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైంది. అలాగే మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది. దీన్ని భట్టి చూస్తే ఈ జిల్లాలో కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు, జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోన కేసుల సంఖ్య 3963 కాగా వారిలో 1902 మంది మహమ్మరి నుంచి సంపూర్నంగా కోలుకున్నారు, మహమ్మారి కారణంగా 35 మంది మృత్యువాత పడ్డారు.
పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో శనివారం నుంచి జిల్లా అంతటా పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే నిత్యవసర సరకుల తెచ్చుకోవడానికి అనుమతిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆ తరువాత ఎవరూ బయలాట తిరగకూడదని కోరారు. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. కరోనా కట్టడిలో భాగంగా శనివారం నుంచి వారం రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు.
బయటికి వచ్చే ప్రజలు మాస్క్ తప్పని సరిగా ధరించి రావాలని… అలాగే సామాజిక దూరం పాటిస్తూ.. శానిటైజర్లు ఖచ్చితంగా వియోగించాలని జిల్లా ప్రజలకు సూచనలు చేశారు కలెక్టర్. కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు.