మాజీ ముఖ్యమంత్రికి కరోనా.. ఆసుపత్రికి తరలింపు..

Update: 2020-07-16 19:25 GMT

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివాజీరావు పాటిల్ నీలంగేక‌ర్(88)‌ క‌రోనా భారిన పడ్డారు. బుధవారం అర్థరాత్రి ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో లాతూర్ జిల్లా నుంచి ఆయనను పుణెలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఆయన కాస్త అసౌకర్యానికి గురైనట్లు కుటుంబానికి చెందిన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా పాటిల్ నీలాంగేకర్ లాతూర్ జిల్లా నుంచి కరోనా భారిన

పడిన రెండవ సీనియర్ రాజకీయ నాయకుడు. అంతకుముందు బిజెపి ఎమ్మెల్యే అభిమన్యు పవార్‌కు పాజిటివ్ పరీక్షలు చేశారు.. ప్రస్తుతం ఆయన లాతూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 1985-86 మ‌ధ్య శివాజీరావు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. కాగా ఇప్ప‌టివ‌ర‌కు మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 2,75,640 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. పాటిల్ నీలంగేకర్ మనవడు సంభాజీ పాటిల్ బిజెపి ఎమ్మెల్యే గా ఉన్నారు.. అంతేకాక దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేశారు.

Similar News