దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈశాన్య రాష్ట్రల్లో కూడా కరోనా విజృంభిస్తోంది. ఇక నాగాలాండ్ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాగాలాండ్ డిప్యూటీ సీఎం యంతుంగో పట్టన్, ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే.. కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. ఢిల్లీలోని నాగాలాండ్ హౌజ్‌లో డ్రైవర్ పాజిటివ్ తేలడంతో వారు పరీక్ష చేయించుకున్నారు.
తాజాగా నాగాలాండ్ సీఎం నైఫియు రియో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఢిల్లీ పర్యటన నుంచి తిరిగిన వచ్చిన తర్వాత కోహిమాలోని తన అధికార నివాసంలో సెల్ఫ్ క్వారెంటైన్ అయ్యారు. అయితే ఇంటి నుంచే విధులు నిర్వర్తించనున్నట్లు సీఎం తన ట్విట్టర్‌లో వెల్లడించారు. ఢిల్లీ నుంచి నాగాలాండ్ చేరుకున్నానని తెలిపారు. అయితే ముందు జాగ్రత్తగా తాను క్వారెంటైన్‌లోకి వెళ్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా మార్గదర్శకాలను పాటించాలని కోరారు.