లేహ్ ప్రాంతానికి చేరుకున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

Update: 2020-07-17 13:47 GMT

కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లడ్ఢాఖ్, జమ్మూ కశ్మీర్ ప్రాంతాలలో సందర్శించనున్నారు. ఈమేరకు ఆయన లేహ్ చేరుకున్నారు. చైనాతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆయన ఎల్‌ఏసీ,ఎల్ఓసీతో పాటు కీలక సరిహద్దు ప్రాంతాలను సందర్శిచనున్నారు. ఆయనతో పాటు సీడీఎస్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణే కూడా ఉన్నారు. చైనా, పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు దిగుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, సరిహద్దు ప్రాంతాలలో పరిస్థితులను దగ్గరుండి ఆయన పరిశీలించనున్నారు. కాగా.. చైనా, భారత్ మధ్య గాల్వాన్ లోయ ఘటన తరువాత ఇటీవలే ప్రధాని మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే.

Similar News