అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతిక అయిన రాఖీ పండుగ సందర్భంగా సైనికులకు 12 వేల రాఖీలు పంపించనున్నారు వడోదర మహిళలు. సైనికుల్లో స్ఫూర్తి నింపేలా, దేశ సరిహద్దుల్లో ఉన్న భారత సైనికులకు గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగర మహిళలు రాఖీలు పంపించనున్నారు.
6 నుంచి 84 ఏళ్ల వృద్ధ మహిళల వరకు రాఖీలు సేకరించి వాటిని మువ్వన్నెల బాక్సుల్లో ప్యాక్ చేసి సియాచిన్, గల్వాన్ లోయ, కార్గిల్ ప్రాంతాలకు పంపనున్నారు. రాఖీ పండుగ సందర్భంగా కార్గిల్, గల్వాన్ లోయ, సియాచిన్ ప్రాంతాల్లోని సరిహద్దుల్లో నిత్యం పహరా కాస్తున్న సైనికులకు మహిళలు ఈ రాఖీలు అందించనున్నారు.