విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు కరోనా భారిన పడ్డారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో సోమవారం రాత్రి ముంబైలోని జేజే ఆసుపత్రికి వరవరరావును తరలించారు. అయితే అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ముంబైలోని తలోజా జైల్లో ఉన్న ఆయన కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యారు.
ఇటీవల ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందంటూ జైలు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను విడుదల చేయాలనీ కోరారు. కాగా భీమా కోరేగావ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావును ఎన్‌ఐఏ అరెస్ట్ చేసి తలోజా జైలుకు తరలించిన విషయం తెలిసిందే.