సచిన్ పైలట్ వెనక్కు తగ్గినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యలు ఆ విషయాన్ని స్ఫష్టం చేస్తున్నాయి. సచిన్ తనకు కాల్ చేసి మాట్లాడారని చిదంబరం వెల్లడించారు. అధిష్టానాన్ని కలవాలని తాను సచిన్ కి సలహా ఇచ్చానని తెలిపారు. అలా చేస్తే.. అన్ని సమస్యలకు పరిస్కారం దొరుకుతుందని.. చర్చల ద్వారా సమస్యలు సర్ధుమనుగుతాయని సచిన్ కి తాను చెప్పినట్టు చిదంబరం చెప్పారు. కాగా.. తనతోపాటు 18 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ.. సచిన్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో చిదంబరం వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ప్రియాంకా గాంధీ కూడా పైలట్ తో మాట్లాడిన సంగతి తెలిసిందే. అటు, సూర్జావాలా, మాకెన్ లాంటి వారు కూడా సచిన్ కోసం కాంగ్రెస్ ద్వారాలు తెరచే ఉన్నాయని ప్రకటించారు.