ఏపీలో ఇటీవల ఇద్దరు ఐపీఎస్ అధికారులు కరోనా బారిన పడ్డారు. వారు దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, డీసీపీ విక్రాంత్ పాటిల్ దంపతులు.. అయితే వీరు చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. శుక్రవారం తిరిగి తమ విధుల్లో చేరారు. ఈ సందర్బంగా ఐపీఎస్ దంపతులకు డీజీపీ గౌతం సవాంగ్ స్వాగతం పలికారు. డీజీపీ ఇచ్చిన నైతిక బలంతోనే త్వరగా కోలుకున్నామని తెలిపారు పాటిల్ దంపతులు. కాగా కరోనా బాధితుల్లో మనోస్థైర్యాన్ని నింపాలని, విధులు నిర్వహిస్తున్న పోలీసులకు లక్షణాలు కనిపించినా, అనుమానం ఉన్నా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ సూచించారు.