ఉత్తర భారతదేశంలో ఇటీవల కాలంలో వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోలనకు గురవుతున్నారు. తాజాగా అసోం, మిజోరంలో వరుస భూకంపాలు సంభవించాయి. అసోంలోని హైలాకుండీలో రిక్టారు స్కేలు మీద 4.0గా నమోదైంది. అటు, మిజోరంలోని దక్షిణ చంఫాయ్ ప్రాంతంలో కూడా సంభవించింది. వరుస భూకంపాలతో ప్రజలు వణికిపోతున్నారు. భూమి కంపించినప్పుడల్లా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు.