జూలై 20 వరకు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దు : రాజస్థాన్ హైకోర్టు

Update: 2020-07-17 19:50 GMT

రాజస్థాన్ లో రెబల్ ఎమ్మెల్యేలకు స్వల్ప ఊరట లభించింది. స్పీకర్ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సచిన్ పైలట్ అలాగే ఆయన మద్దతుదారులైన 18 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను జూలై 20 కి వాయిదా వేసింది హైకోర్టు. జూలై 21 సాయంత్రం వరకు ఎమ్మెల్యేలపై ఏ విధమైన చర్యలు తీసుకోవద్దని రాజస్థాన్ హైకోర్టు స్పీకర్‌ ను ఆదేశించింది. దీంతో మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు ఎమ్మెల్యేలపై ఏ విధమైన చర్యలు ఉండవని హైకోర్టులో స్పీకర్ సిపి జోషి తరఫు న్యాయవాది ప్రతీక్ కస్లివాల్ వివరణ ఇచ్చారు. కాగా 19 మంది రెబల్‌ ఎమ్మెల్యేకు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలంటూ పిటిషనర్ల తరఫు ప్రముఖ న్యాయవాదులు హరీష్‌సాల్వే, ముకుల్ రోహత్గి హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే.

Similar News