ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ బేసిన్ లోని ప్రాజెక్టుకులకు అధిక స్థాయిలో నీరు చేరుతోంది. ఎగువున ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి 45 వేల క్యూసెక్కులు చొప్పున దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం అధికంగా ఉంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి ఇన్‌ఫ్లో లక్షకు పైగా క్యూసెక్కుల నీటి విడుదల చేశారు.. దీంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా...
ప్రస్తుతం నీటి మట్టం 835.60 అడుగులకు చేరింది. శుక్రవారం సాయంత్రం జలాశయంలోకి 1,03,657 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 55.8766 టీఎంసీలకు చేరుకుంది. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో గత కొద్దీ రోజులుగా కూస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో వరద పెరిగి శ్రీశైలం జలాశయంలోకి ఉధృతి వస్తోందని అధికారులు తెలిపారు.