సుశాంత్‌ కేసులో ముంబై పోలీసుల పనితీరు బాగుంది: మహారాష్ట్ర ప్రభుత్వం

Update: 2020-07-17 20:03 GMT

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు సీబీఐకి అప్పగించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మహారాష్ట్ర హోంమంత్రి ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై పోలీసులు సుశాంత్ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేస్తున్నారని హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అన్నారు. ముంబై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని.. సీబీఐ అవసరం లేదని అన్నారు. సుశాంత్ వృత్తిపరమైన అంశాలపై కూడా వివరాలు సేకరిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకూ ముంబై పోలీసుల దర్యాప్తులో ఎలాంటి లోపం కనిపించలేదని అన్నారు. దర్యాప్తు పూర్తైన తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు.

Similar News