ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు గవర్నర్ బిస్వభూషణ్ హరిచంద్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సోమవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కలవాలంటూ సందేశం ఇచ్చారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలతో గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు నిమ్మగడ్డ. sec గా నిమ్మగడ్డను నియమించకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డను తిరిగి ఎందుకు నియమించలేదని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో గవర్నర్ ను కలవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ కానున్నారు.