శ్రీవారి ఆలయ భక్తులను కరోనా కలవరపెడుతోంది. ఇప్పటికే టీటీడీకి చెందిన 15 మందికి పైగా అర్చకులకు కరోనా సోకింది. తాజాగా శ్రీవారి ఆలయ పెద్ద జీయర్ స్వామికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో టీటీడి అధికారులు స్వామీజీని తిరుపతిలోని పద్మావతి క్వారంటైన్‌కు తరలించారు. కేసులు పెరుగుతుండడంతో శ్రీవారి దర్శనాలు కూడా నిలిపివేశారు ఆలయ అధికారులు. దాదాపు 80 రోజుల తరువాత తెరుచుకున్న దేవాలయానికి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి జూన్ 11 నుంచి దర్శనానికి అనుమతి కల్పించారు. అయినా 15 మంది అర్చకులతో సహా 140 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. మరో 20 మంది ఫలితాలు వెల్లడికావల్సి ఉంది.