కర్నాటకలో సంపూర్ణ లాక్‌డౌన్

Update: 2020-07-19 15:23 GMT

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. మొదట్లో కర్నాటకలో కరోనా ప్రభావం తక్కవగా కనిపించినా.. ఇటీవల వరుసగా.. ప్రతీరోజు 4వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ అమలులో ఉంది. పండగల సీజన్ ప్రారంభం కావడంతో.. వాటి నిర్వాహణపై దీర్ఘంగా చర్చలు జరుగనున్నాయి. మతపెద్దలతో కర్నాటక ప్రభుత్వం రెండురోజుల్లో ఈ సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ వ్యవహారం గురించి మాట్లాడిన దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి అన్ని పండగలు రాష్ట్రంలో నిర్వహిస్తామని.. కానీ, అన్ని నిరాడంబరంగా ఇంట్లోనే జరిగేలా మార్గదర్శాకాలు జారీ చేస్తామని అన్నారు

Similar News