కర్ణాటకలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,537 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనా బారిన పడి 93 మంది మరణించారు. 1,018మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 59,652కు చేరింది. వీరిలో 36,631మంది చికిత్స పొందుతున్నారు. కరోనా బారి నుండి 21,775మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మహమ్మారి బారిన పడి రాష్ర్టవ్యాప్తంగా 1,240మంది ప్రాణాలు కోల్పోయారు.