దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేరళలో కరోనా స్వైర విహారం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో అక్కడ 593 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 11,659కి చేరింది. అందులో 6,416 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మిగతా కేసులు కరోనా బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 39 మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.