ఏపీలో కరోనా కేసులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 3963 కేసులు నమోదయ్యాయని ఏపీ ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజులో 52 మంది మృతి చెందారు. తాజాగా నమదైన కేసులతో ఏపీలో మొత్తం కేసులు సంఖ్య 44609కి చేరింది. అటు, మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవడంతో 586 మంది కరోనాతో మృతి చెందారు. ఈరోజు మరణించిన వారిలో తూర్పుగోదావరిలో 12 మంది, గుంటూరులో 8 మంది, కృష్ణాలో 8 మంది, అనంతపురంలో ఏడుగురు, ప్రకాశంలో నలుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు ఉన్నారు.