కరోనా అన్ని రాష్ట్రాల్లో రోజురోజుకు విజృంభిస్తుంది. ఒడిశా ప్రభుత్వం కరోనా కట్టడికి కీలక చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రతీ రోజు కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్కరోజే 591 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,701కి చేరుకుందని ఒడిశా ఆరోగ్యశాఖ వెల్లడించింది.