కరోనా కలకలం.. దేశంలో సామాజిక వ్యాప్తి మొదలైంది : ఐఎంఏ

Update: 2020-07-19 08:53 GMT

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. సగటున మూడు రోజుల్లో లక్ష చొప్పున నమోదవటం వెనుక ఉన్న కారణాన్ని భారతీయ వైద్య మండలి (ఐఎంఏ) వెల్లడించింది. ఇప్పటికే మనదేశంలో కరోనా వైరస్‌ సామూహిక సంక్రమణ దశలోకి ప్రవేశించిందని ప్రకటించింది.

ప్రస్తుతం దేశంలోపరిస్థితి ఏ మాత్రం బాగోలేదని తెలిపింది. సగటున రోజుకు 30 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇంతకాలం పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువ ప్రభావం చూపిస్తున్న మహమ్మారి.. ఇప్పుడు గ్రామాల్లోకీ ప్రవేశిస్తున్నదని ఐఎంఏ హెచ్చరించింది. మరోవైపు, వచ్చే రెండు నెలల్లో కరోనా కేసులు పీక్‌స్టేజికి చేరుకోవచ్చని.. ఆ తర్వాత క్రమంగా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టవచ్చని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేసింది.

అయితే, దేశంలో యాక్టివ్‌ కేసుల కన్నా.. రికవరీల సంఖ్య రెట్టింపునకు చేరుకుందని కేంద్రం తెలిపింది. ఇదొక సానుకూల పరిణామం అని శనివారం వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 63 శాతంగా నమోదైందని కేంద్రం పేర్కొంది.

Similar News