దేశంలో ఒకేరోజు 38,902 కరోనా కేసులు

Update: 2020-07-19 13:05 GMT

దేశంలో కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. వరుసగా గత నాలుగు రోజులుగా 32 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 38,902 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 10,77,618కు చేరింది. కరోనా మహమ్మారి కారణంగా 543 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం మరణాలు 26,816కు పెరిగాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,73,379 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరో 6,77,423 మంది బాధితులు కోలుకున్నారు. రికవరీ రేటు 62.93 శాతంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

Similar News