తమిళనాడులో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ప్రతిపక్ష డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కరోనా సోకింది. కృష్ణగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే టీ సెంగుట్టవన్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో.. పరీక్ష జరిపారు. రిపోర్టులో ఆయనకు కరోనా పాటిజివ్‌గా ఆదివారం నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యే సెంగుట్టవన్ ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందతున్నారని కృష్ణగిరి ప్రాంత ఆరోగ్య విభాగం డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు.