విశాఖలో మద్యం షాపుల వద్ద మద్యం ప్రియులు బారులు తీరారు. కరోనా ఎఫెక్ట్ తో షాపులు క్లోజ్ చేస్తారన్న ప్రచారంతో ముందే పెద్దఎత్తున స్టాక్ పెట్టుకునేందుకు ఎగబడుతున్నారు. కరోనా నిబంధనలకు తూట్లు పొడిచి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఒకటినొకరు తోసుకుంటూ మద్యం కొనుగోలు చేస్తున్నారు. నగరంలోని చాలా వైన్ షాపుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. మద్యం ప్రియులను కంట్రోల్ చెయ్యకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారని నగర ప్రజలు మండిపడుతున్నారు. మందుబాబుల చర్యల వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.