కేరళలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతోంది. తీర ప్రాంతాల్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. దీంతో తీర ప్రాంతాల్లో కరోనా మహమ్మారి కట్టడికి స్థానిక అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. తాజాగా తిరువనంతపురం తీర ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు ఆ జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలను మూడు క్రిటికల్ కంటైన్‌మెంట్ జోన్‌లుగా విభజించారు.
ఆ మూడు జోన్‌లలో జూలై 18 అర్థరాత్రి నుంచి జూలై 28 వరకు పది రోజులపాటు కఠిన లాక్‌డౌన్ విధించినట్లు కలెక్టర్ స్పష్టంచేశారు. ఈ 10 రోజులపాటు ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ నిబంధనలు వర్తించవని, కఠిన లాక్‌డౌన్ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.