సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ

Update: 2020-07-19 17:13 GMT

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. సీఎం జగన్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో పలు సమస్యలపై ఇప్పటికే సీఎంకు లేఖ రాసిన ఆయన.. తాజాగా గోశాల అంశంపై మరో లేఖ రాశారు. రాష్ట్రంలో గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. 2005లో వైఎస్ సీఎంగా ఉన్నపుడు గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చారు. రాష్ట్ర విభజన తరువాత కమీటీలు వేయలేదని గుర్తు చేశారు. ఆర్ధిక ఇబ్బందులు వలనే గత ఏడాది సింహాచలంలో మూడు ఆవులు చనిపోయాయని.. తాడేపల్లి-కొత్తూరు గోశాలలో వంద ఆవులు విషప్రయోగం వలన చనిపోయాయని అన్నారు. ఆవులు, దూడలు సంరక్షణ హిందువుల హృదయాలకు దగ్గరగా ఉంటుంది. అన్నివర్గాలు, అధికారులతో కలిపి గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేయాలని రఘురాజు సీఎం జగన్ ను కోరారు.

Similar News