మరో రెండు రోజులపాటు ఢిల్లీలో భారీ వర్షాలు!

Update: 2020-07-19 14:03 GMT

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం గంట పాటు ఏకధాటిగా వాన పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.

మరో రెండు రోజులపాటు ఢిల్లీలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీ, హరియాణ, చండీగఢ్‌ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Similar News