ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీహర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు కనౌజ్ దగ్గర కారును ఢీ కొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరికొంత మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే.. ప్రయానికలు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. తరువాత స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్పించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.