ఏపీలో కరోనా విస్ఫోటనం.. కొత్తగా 5,041 పాజిటివ్ కేసులు

Update: 2020-07-19 21:24 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులొచ్చాయి. మొత్తం 31,148 సాంపిల్స్‌ ని పరీక్షించగా 5,041 మంది కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కొత్తగా 1106 మంది కోవిడ్‌ నుండి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌ వల్ల తూర్పు గోదావరి లో 10, శ్రీకాకుళంలో 8 మంది, కర్నూల్‌ లో ఏడుగురు, విశాఖపట్నం లో ఏడుగురు, కృష్ణ లో ఏడుగురు , ప్రకాశం లో నలుగురు, అనంతపురం లో ముగ్గురు, కడప లో ముగ్గురు, విజయనగరం లో ముగ్గురు , గుంటూరు లో ఇద్దరు , చిత్తూరు లో ఇద్దరు మరణించారు.

Similar News