ఒక్కరోజే 2.2 ల‌క్ష‌ల మందికి క‌రోనా పాజిటివ్

Update: 2020-07-20 10:28 GMT

కరోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాలను గజగజ వ‌ణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప‌్ర‌పంచవ్యాప్తంగా కేవ‌లం 24 గంట‌ల వ్యవధిలోనే 2,20,073 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల్లో అత్య‌ధికంగా అమెరికా, బ్రెజిల్‌, భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా దేశాల్లోనే ఉన్నాయి. దీంతో ప్ర‌పంచంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,46,41,819కి చేరింది. కరోనా బారిన పడి 6,08,902 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో బాధపడుతూ 87,35,158 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మ‌రో 52,97,759 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇక అత్య‌ధిక కేసుల జాబితాలో ఇండియా మూడో స్థానంలో ఉంది. రోజువారీ న‌మోద‌వుతున్న కేసుల్లో అమెరికా త‌ర్వాత రెండోస్థానంలో ఉంది. మొత్తం మ‌ర‌ణాల్లో భార‌త్ ఎనిమిదో స్థానంలో ఉంది. రోజువారీ మ‌ర‌ణాల్లో రెండో స్థానానికి చేరింది.

Similar News