రాష్ట్రపతికి అఖిల భారత హిందూమహాసభ లేఖ

Update: 2020-07-19 20:03 GMT

అఖిల భారత హిందూమహాసభ భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాసింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ఆమోదించవద్దని .. మహాసభ జాతీయ కార్యదర్శి డాక్టర్ జీవీఆర్ శాస్త్రీ లేఖ రాసారు. ఈ రెండు బిల్లులు సెలక్ట్ కమిటీ వద్ధ ఉన్నాయని.. ఇలా పెండింగ్ లో ఉన్న బిల్లులు తిరిగి ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్దమని లేఖలో తెలిపారు. హైకోర్టులో కూడా అంశాలు ఉన్నాయని.. కానీ, ప్రభుత్వం కోర్టు పరిదిలోని అంశాల విషయంలో ముందుకు వెళ్తూ.. కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు .. 2014 ఏపీ పునర్వవస్థీకరణ చట్టానికి విరుద్దంగా ఉందని లేఖలో ప్రస్తావించారు.

Similar News