దేశ రాజధానిలో వర్ష భీభత్సం

Update: 2020-07-19 20:21 GMT

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉదయం భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రధాన రోడ్లపై భారీఎత్తున నీరు నిలిచిపోయింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి ఐటీఓ ప్రాంతంలోని మురికివాడ వద్ద పరిస్థితి దారుణంగా మారింది. వరద ప్రవాహానికి మురికి కాలువ ఉప్పొంగి ప్రవహించింది. ఓ ఇల్లు ప్రవాహ ధాటికి క్షణంలో కూలి నీటిలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఐకానిక్ మింటో వంతెన కింద ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. అతడు చండీగఢ్ కు చెందిన కుందన్ (56) గా పోలీసులు గుర్తించారు. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.

Similar News