దేశంలో కరోనా విజృంభిస్తోంది. కేరళలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం జిల్లాలో కఠిన లాక్‌డౌన్ అమలు చేయాలని ఆ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ ఆదివారం ఆదేశించింది. తీరప్రాంతాల్లోని క్రిటికల్ కంటైన్‌మెంట్ జోన్లకు వెలుపల కార్పొరేషన్ వార్డులకు మాత్రమే లాక్‌డౌన్ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
కిన్ఫ్రా పార్కుల్లో ఆహార ప్రాసెసింగ్, వైద్య, అనుబంధ ఉత్పత్తుల తయారీకి అనుమతించింది. నిర్మాణ స్థలాల లోపల శిబిరాల్లో కార్మికులు బస చేసేందుకు, భవనాల నిర్మాణానికి సైతం డీడీఎంఏ అనుమతి ఇచ్చింది. అనుమతించబడిన కార్యకలాపాల్లో గరిష్టంగా 30 శాతం సిబ్బందే పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నిర్మాణ ప్రదేశం వెలుపల కార్మికులకు అనుమతి ఉండబోదని తెలిపింది.