జర్నలిస్టులకు నారా లోకేశ్ చేయూత

Update: 2020-07-19 23:22 GMT

కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పోరాడుతోన్న జర్నలిస్టుల ధైర్యాన్ని గుర్తించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వారికి అండగా ముందుకొచ్చారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో 62 మంది జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించారు. సహజ మరణానికి పది లక్షలు, ప్రమాద మరణమైతే 20 లక్షల భీమా.. కోవిడ్ మరణాలకు వర్తించేలా ప్రీమియంను చెల్లించారు. కరోనా విజృంభిస్తున్న వేళా ప్రజల్ని చైతన్యం చేసేందుకు ఫ్రెంట్ లైన్ వారియర్స్ తోపాటు కలిసి పనిచేస్తూ కరోనా కోరల్లో చిక్కి జర్నలిస్టు మృత్యువాత పడటంపై నారా లోకేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవిస్తూనే తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు లోకేశ్.

Similar News