ఈశాన్యరాష్ట్రంలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటేత్తుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకుగాను 24 జిల్లల్లో వరదల తీవ్రత అధికంగా ఉంది. భారీ వరదలకు ఆదివారం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది వరదల కారణంగా మరణించినవారి సంఖ్య 110కి చేరింది. 25లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌తో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాన్ని అన్నివిధాలుగా ఆదుకొంటామని హామీ ఇచ్చారు.