ప్రభుత్వ పెద్దలు మోసం చేశారంటూ విషం తాగిన మాలమహానాడు మహిళా నాయకురాలు

Update: 2020-07-20 17:02 GMT

ప్రభుత్వ పెద్దలు తనను మోసం చేశారంటూ మాలమహానాడు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు జోని కుమారి విజయవాడ ప్రెస్ క్లబ్ లో అందరిముందు విషం తాగారు. తన సమస్యలు పరిష్కరించాలంటూ ఆమె ప్రెస్ మీట్ పెట్టారు. తనకు జరిగిన అన్యాయాన్ని కరోనా పరిస్థితుల వల్ల సీఎం జగన్ కు చెప్పుకోలేకపోయానన్నారు జోని కుమారి. పార్టీ నేతల్ని కలిసినా తన సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు జోని కుమారి.

వైసీపీని తన సొంత కుటుంబంలా భావిస్తే పార్టీలో ఉన్నతస్థాయిలో ఉన్న పెద్దలు తనను మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల ఆరున విజయసాయిరెడ్డిని కలిసినా న్యాయం జరగలేదని అన్నారు. ప్రెస్ మీట్ తరువాత అక్కడే తనవెంట తెచ్చుకున్న బాటిల్ ఓపెన్ చేసి విషం తాగారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News