గుజరాత్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా బారిన పడి ఎంతో మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో కొత్త రోగులకు హాస్పిటల్‌లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రోగుల కోసం ఓ మసీదు కరోనా కేర్ సెంటర్ గా మారింది. గోద్రాలోని ఒక మసీదు కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చి అందులోని ఒక ఫ్లోర్‌ను కరోనా బాధితుల కోసం కేటాయించారు. ఇక్కడ ఇతర వర్గాలకు చెందిన 9 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ మసీదులోని గ్రౌండ్ ఫ్లోర్‌ను ముస్లిం మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. మహిళలు ఇక్కడ ఉండటానికి అన్ని వసతులు కల్పించారు. ఇప్పుడు దీనినే కరోనా కేర్ సెంటర్‌గా మార్చారు. గుజరాత్‌లో పెరుగుతున్న కరోనా రోగుల దృష్ట్యా మసీదు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.