కేంద్ర పాలితప్రాంతమైన లడఖ్ , గుజరాత్ రాష్ట్రానికి బీజేపీ నూతన అధ్యక్షులను నియమించింది. ప్రస్తుతం లోక్‌సభ ఎంపిలుగా ఉన్న సిఆర్ పాటిల్, జమయంగ్ నంగ్యాల్ షెరింగ్ లను ఈ పదవులకు ఎంపిక చేసింది. తొలిసారి ఎంపీగా ఎన్నికైన జమయంగ్ నంగ్యాల్ షెరింగ్ లడఖ్ యూనిట్ కు అధ్యక్షుడిగా చేసింది. అలాగే గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఆర్ పాటిల్‌ను నియమిస్తున్నట్టు పార్టీ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 65 ఏళ్ల సీఆర్ పాటిల్ గుజరాత్‌లోని
నవ్‌సారి ఉంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ప్రధానికి ఆప్తుడు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలో అభివృద్ధి పనులను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఇక 35 ఏళ్ల నంగ్యాల్ లద్దాఖ్ నుంచి తొలిసారిగా ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో మంచి ప్రతిభ కనబరిచారు.