కేరళలో కరోనా కేసులు సంఖ్య ఇటీవల విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 794 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7,611కి చేరిందని కేరళ సీఎంఓ ప్రకటించింది. 5,618 ఇప్పటివరకూ రికవరీ అయ్యారని తెలిపింది. కేరళలో రికవరీ కేసుల సంఖ్య.. యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. కాగా.. కేరళలో లోకల్ ట్రాన్స్‌మిషన్ కూడా కలవరపాటుకు గురిచేస్తోంది. సోమవారం కొత్తగా కరోనా సోకిన 794 మందిలో 519 మంది లోకల్ ట్రాన్స్‌మిషన్ ద్వారానే కరోనా బారిన పడినట్లు తెలిసింది.