సెలవు దినాల్లో దుబాయ్ కాన్సులేట్..

Update: 2020-07-20 18:44 GMT

దుబాయ్ ఇండియన్ కాన్సులర్ జనరల్ గా బాధ్యతలు తీసుకున్న అమన్ పూరి ప్రవాసులకు తీపి కబురు అందించారు. ఆదివారం రోజు బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆగస్టు 1 నుంచి సెలవు దినాల్లో సైతం దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెరిచే ఉంటుందని వెల్లడించారు. వారాంతపు రోజులు, సెలవు దినాలు, పండుగ రోజుల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కార్యాలయ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. డిసెంబర్ 31 వరకు సెలవు దినాల్లో కాన్సులేట్ కార్యాలయం పనిచేస్తుందని చెప్పారు. కరోనా నేపథ్యంలో అత్యవసర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు అమన్ వివరించారు. కరోనా నేపథ్యంలో యూఏలో చిక్కుకున్న వారిని ఇండియాకు తీసుకు వచ్చే ప్రక్రియ కోనసాగుతుందన్నారు.

Similar News