మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత

Update: 2020-07-21 09:40 GMT

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మంగళవారం (జూలై 21) మరణించారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. ఈ వార్తను ఆయన కుమారుడు అశుతోష్ టాండన్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. జ్వరం మరియు మూత్ర పిండాల సమస్యలతో బాధపడుతున్న గవర్నర్ టాండన్ జూన్ 13 న లక్నో (ఉత్తర ప్రదేశ్) లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.

రెండు రోజుల తరువాత, మేదంతా హాస్పిటల్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాకేశ్ కపూర్, టాండన్ కాలేయం పనిచేయడం లేదని.. దాంతో శస్త్రచికిత్స చేశారు, ఆ తరువాత టాండన్ పరిస్థితి మరింత విషమించిందని సమాచారం. ఈ క్రమంలో వెంటిలేటర్‌ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా టాండన్ ఆరోగ్యం సరిగా లేనందున ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు మధ్యప్రదేశ్ అదనపు బాధ్యతలు అప్పగించారు.

Similar News