భారత్ లో కొత్తగా 37,148 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-07-21 11:21 GMT

భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కోనసాగుతోంది. పాజిటివ్ కేసులు ప్రస్తుతం 11 లక్షల 55 వేలు దాటాయి. గత 24 గంటలలో అత్యధికంగా 37,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా వల్ల కొత్తగా 587 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,55,191 ఉండగా.. ఇందులో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి

సంఖ్య 7,24,577 గా ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 4,02,529 ఉన్నాయి. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 28,084 కు చేరుకుంది. గడచిన 24 గంటలలో రికార్డ్ స్థాయిలో దేశ వ్యాప్తంగా 3,33,395 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిగాయి. దీంతో ఇప్పటి వరకు దేశంలో 1,43,81,303 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు పూర్తయ్యాయి.

Similar News