మధ్యప్రదేశ్ గవర్నర్ మృతిపట్ల ప్రధాని దిగ్భ్రాంతి..

Update: 2020-07-21 10:22 GMT

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు. శ్రీ లాల్జీ టాండన్ సమాజానికి సేవ చేయడానికి ఆయన చేసిన కృషి జ్ఞాపకం ఉంటుంది. ఉత్తర ప్రదేశ్‌లో బిజెపిని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సమర్థవంతమైన నిర్వాహకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు, ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమానికి ప్రాముఖ్యత ఇస్తారు అని పేర్కొన్నారు. ఆయన మృతిపట్ల ప్రధాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం లక్నోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. ఉత్తరప్రదేశ్‌ శాసన సభకు, శాసన మండలికి పలు పర్యాయాలు ఎన్నికైయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా మాయావతి సర్కార్‌లో రాష్ట్రమంత్రిగా కూడా వ్యహరించారు. 2009లో లక్నో పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైయ్యారు.

Similar News